: శ్రీలంక డేంజర్ మ్యాన్ మ్యాథ్యూస్ ను క్విక్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చిన కోహ్లీ... ఆరో వికెట్ డౌన్
గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున భారత బౌలర్లు ప్రమాదకరమైన మ్యాథ్యూస్ ను తొలి గంట వ్యవధిలోనే పెవిలియన్ చేర్చారు. రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి, ఆపై మూడో రోజు ఆటను ప్రారంభించిన లంక జట్టులో మ్యాథ్యూస్, తన సహచరుడు పెరీరాతో కలసి స్కోర్ బోర్డును 200 పరుగులను దాటించాడు.
ఆపై 59వ ఓవర్ ను జడేజా వేయగా, ఐదో బంతికి భారీ షాట్ కొట్టబోయిన మ్యాథ్యూస్, మిడాన్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి దొరికిపోయాడు. మొత్తం 130 బంతులను ఎదుర్కొన్న మ్యాథ్యూస్ 83 పరుగులు చేశాడు. ప్రస్తుతం శ్రీలంక స్కూరు 61 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు కాగా, భారత్ చేసిన 600 పరుగులకు ఇంకా 384 పరుగుల దూరంలో ఉంది.