: రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసింది తానేనని అంగీకరించిన జిషాన్


ప్రముఖ నటుడు రవితేజ రేపు సిట్ ముందు విచారణకు హాజరుకానున్నాడు. సిట్ నోటీసులు జారీ చేసినవారిలో రవితేజ పేరు వెలుగు చూడడంతో టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. ఈ మధ్యే కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భరత్ పలు సందర్భాల్లో డ్రగ్స్ వివాదంలో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పేరు చెడగొడుతున్నాడంటూ అతనిపై విమర్శలు కూడా వెలువడ్డాయి. అయితే కెల్విన్, జిషాన్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. దీంతో కెల్విన్ తో పాటు, జిషాన్ విచారణలో కూడా రవితేజ పేరు వెలుగు చూసింది. డ్రగ్ సరఫరాదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జిషాన్ కు గత ఆరేళ్లుగా రవితేజతో సన్నిహిత సంబంధాలున్నాయని సిట్ అధికారులు గుర్తించారు. రవితేజకు కెల్విన్ ను పరిచయం చేశానని, డ్రగ్స్ కూడా సరఫరా చేశానని జిషాన్ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News