: `ఫిదా` సినిమాను పొగడ్తలతో ముంచెత్తిన కేటీఆర్
తెలంగాణ పల్లె జీవితాన్ని, యాసను `ఫిదా` సినిమాలో చాలా బాగా చూపించారని దర్శకుడు శేఖర్ కమ్ములను మంత్రి కేటీఆర్ పొగిడారు. తెలంగాణ నేపథ్యంలో ఇంత చక్కటి ప్రేమకథను చూపించినందుకు తాను ఫిదా అయ్యానని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సినిమాను పొగుడుతూ ఆయన ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్, సాయి పల్లవిలను ఈ ట్వీట్లో కేటీఆర్ ట్యాగ్ చేశారు. ఇప్పటికే ఈ `ఫిదా` సినిమా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మనసు గెల్చుకున్న సంగతి తెలిసిందే.