: కేటీఆర్ నువ్వో బచ్చా.. నోరు అదుపులో పెట్టుకో: వీహెచ్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఓ బచ్చా అని... నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరుగుతుందని అసత్య ప్రచారాలు చేయడం ఆపేయాలని అన్నారు. ఒకవేళ అవినీతి జరిగిందని భావిస్తుంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేవలం ఒక కుటుంబం కోసమే పాలన సాగుతోందని మండిపడ్డారు. నేరెళ్ల పోలీస్ బాధిత కుటుంబాలను ఈరోజు వీహెచ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పై మండిపడ్డారు.