: ఫ్రీచార్జ్‌ను దక్కించుకున్న యాక్సిస్ బ్యాంక్
స్నాప్‌డీల్ వారి రీచార్జ్ అప్లికేషన్ ఫ్రీచార్జ్‌ను 60 మిలియన్ డాలర్ల ఒప్పందానికి ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ దక్కించుకుంది. ఈ మేరకు ఫ్రీచార్జ్ సహ-వ్యవస్థాపకుడు కునాల్ బాల్ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశాడు. నిజానికి 27 నెలల క్రితమే ఫ్రీచార్జ్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు అమ్మేయాలని అనుకున్నట్లు, కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదరక ఆ ఆలోచన వదులుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2010లో ప్రారంభించిన ఫ్రీచార్జ్ కంపెనీని 2015లో 400 మిలియన్ డాలర్లకు స్నాప్‌డీల్ సొంతం చేసుకుంది. స్నాప్‌డీల్ ఆన్లైన్ మార్కెటింగ్‌ను దక్కించుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఆఫర్ చేసిన 950 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అంగీకరించేందుకు స్నాప్‌డీల్ బోర్డ్ సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.