: సింపుల్ గా ముగిసిన నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవం


బీహార్ లో నాలుగేళ్ల తరువాత మరోసారి బీజేపీ - జేడీ (యూ) కూటమి గద్దెనెక్కింది. కొద్దిసేపటి క్రితం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ తో గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మంత్రిగా సుశీల్ కుమార్ కూడా ప్రమాణం చేశారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్, నిన్న రాజీనామా ప్రకటించిన తరువాత, బీజేపీ మద్దతుతో నేడు తిరిగి అవే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. నితీశ్ ప్రమాణ స్వీకారం ఏ మాత్రం అట్టహాసం లేకుండా సింపుల్ గా ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఆయన హాజరు కాలేదు. పలువురు జేడీ (యూ), బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News