: బీహార్‌లో హైడ్రామా.. ఆస్పత్రి పాలైన గవర్నర్!
బీహార్‌లో ఓవైపు రాజకీయ సంక్షోభం ముదిరి రసకందాయంలో పడితే మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఆస్పత్రి పాలయ్యారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడుతున్న ఆయనను పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరారు. నితీశ్ కుమార్ రాజీనామా పత్రాన్ని తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన గవర్నర్ రాత్రి 11 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు. కాగా, హైడ్రామా నేపథ్యంలో నితీశ్ తన ప్రమాణ స్వీకారాన్ని నేటి సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 గంటలకు మార్చారు. మరికొద్ది సేపట్లో ఆయన ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.