: నా పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్ ను ఎదురు ప్రశ్నించిన ఛార్మి


డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ సినీ నటి ఛార్మి నిన్న సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పలువురిని తాము అనుకున్న విధంగానే విచారించిన సిట్ అధికారులను ఛార్మి నిరాశకు గురి చేసిందని చెబుతున్నారు. విచారణ సమయంలో ప్రతి ప్రశ్నకు తెలియదు, లేదు అంటూ సమాధానాలిచ్చినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు సమాధానంగా 'నా పర్సనల్ విషయాలు మీకెందుకు' అంటూ ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

కెల్విన్ తో పరిచయం ఉందా అని ప్రశ్నిస్తే... అతనెవరో తనకు తెలియదని, అతని ఫోన్ లో తన నెంబర్ లేదని ఛార్మి చెప్పింది. పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు మీరెప్పుడైనా చూశారా అనే ప్రశ్నకు లేదు అని సమాధానం చెప్పింది. ఇలా అన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఆమె ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, ఛార్మి విచారణతో పలు విషయాలు తెలుస్తాయని ఆశించిన సిట్ అధికారులకు నిరాశ ఎదురైంది. రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరిస్తామని అధికారులు కోరగా... అందుకు ఆమె నిరాకరించింది. 

  • Loading...

More Telugu News