: బీజేపీతో కలిసి నితీశ్ సంకీర్ణ ప్రభుత్వం?
బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ తన తదుపరి అడుగులు ఎటువైపు పడతాయనే అంశంపై రాజకీయా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన పదవికి రాజీనామా చేసి ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నితీశ్, బీజేపీ మద్దతుతో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ లో మొత్తం శాసనసభా స్థానాల సంఖ్య 243 కాగా, ప్రభుత్వం ఏర్పరచాలంటే కావాల్సిన కనీస మెజార్టీ స్థానాల సంఖ్య 122.
బీహార్ అసెంబ్లీలో బలాబలాల గురించి చెప్పాలంటే..
* జేడీయూ - 71
* ఆర్జేడీ -80
* బీజేపీ -53
* కాంగ్రెస్ -27
* ఎల్జేపీ -2
* ఇతరులు -10