: మరోసారి సత్తా చాటిన పుజారా.. 12వ సెంచరీ నమోదు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా సత్తా చాటాడు. సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పుజారా 109 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్ లో రహానే 13 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 333 పరుగులు. ఈ మూడు వికెట్లను శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ తీయడం విశేషం.