: డ్రగ్స్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు... ఇండస్ట్రీకి చెందిన వాడా?
డ్రగ్స్ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ ఆఫీస్‌లో ఛార్మీ విచారణ జరుగుతుండగా ఆమె ఇచ్చిన సమాచారం మేరకే ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యక్తిని ముసుగు వేసి తీసుకురావడం వల్ల సినిమా పరిశ్రమకు చెందినవారా? కాదా? అనే విషయం ఇంకా తెలియరాలేదు. మరో గంటలో ఛార్మీ విచారణ ముగిసిన తర్వాత కొత్తగా అరెస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ స్పష్టత ఇవనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో మరో వ్యక్తిని కూడా సిట్ ఆఫీస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.