: ఇన్ఫోసిస్ నుంచి మరొకరు బయటకి!
టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ బోర్డులో 8 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొత్తగా ఇన్ఫోసిస్ కార్పోరేట్ హెడ్ యూసుఫ్ బషీర్ ఆ జాబితాలో చేరారు. ఈయన కూడా గతంలో సీఈఓ విశాల్ సిక్కాతో కలిసి జర్మనీ కంపెనీ శాప్‌లో పనిచేసినవారే. విశాల్‌తో పాటు 16 మందిని ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులుగా శాప్ కంపెనీ నుంచి ఇన్ఫోసిస్ తీసుకుంది. గత ఏడాది మార్చి నుంచి వీరిలో ఒకరి తర్వాత ఒకరు తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. వీరి రాజీనామాల వెనక ఉన్న సరైన కారణాలేవీ తెలియరాలేదు. ఇప్పటివరకు మైఖేల్ రే, స్టెఫానీ ముల్లర్, డేవిడ్ కెన్నడీ, మేట్ రడాల్జీ, షీనమ్ ఓరీ, గార్డన్ మోహి, ఆనంద్ సిన్హా, రితికా సూరిలు ఎగ్జిక్యూటివ్ బోర్డు నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయారు.