: అద్దె చెల్లించండి.. మా జైళ్లలో ఉంచండి: తెలంగాణ జైళ్ల శాఖ
జైళ్లలో ఉన్న గదులను ఇతర రాష్ట్రాలకు అద్దెకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాలలోని జైళ్లు కిక్కిరిసి ఉన్నాయని... దీంతో, ఆయా రాష్ట్రాలకు జైలు గదులను అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఖైదీకి రూ. 10 వేలు అద్దెకు తీసుకుంటామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి సదుపాయాన్ని నార్వే దేశం కల్పిస్తోంది.