: ధావన్ సెంచరీకి తోడుగా పుజారా హాఫ్ సెంచరీ... 200కు చేరువైన స్కోర్
తన సెంచరీతో శిఖర్ ధావన్ ఫామ్ ను కొనసాగిస్తున్న వేళ, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా వచ్చిన పుజారా సైతం హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడంతో భారత స్కోరు 200 పరుగులకు చేరువైంది. భారత బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో లంక బౌలర్లు విఫలమవుతున్న వేళ, పరుగులు వేగంగా వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లంక బౌలర్లలో ప్రదీప్ కు మాత్రమే వికెట్ దక్కింది. పెరీరా, హెరాత్, కుమారాలు వేస్తున్న మంచి బాల్స్ ను వదులుతూ, చెత్త బాల్స్ ను బాదుతూ పుజారా, ధావన్ లు స్కోరును ముందుకు తీసుకెళుతున్నారు. లంచ్ విరామం వరకూ ఓవర్ కు నాలుగు పరుగుల వరకూ పిండుకున్న భారత్, ఆపై ఆరు పరుగులకు పైగా సాధిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం భారత స్కోరు 38 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 184 పరుగులు.