: బీజేపీ కేంద్ర కార్యాలయ అటెండర్లు, ప్యూన్లు, స్వీపర్లు, డ్రైవర్లకు అల్పాహార విందునిచ్చిన వెంకయ్యనాయుడు


ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు బీజేపీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి వీడ్కోలు విందునిచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లే అవకాశం లేని నేపథ్యంలో అందులో పని చేస్తున్న 46 మంది సిబ్బందికి అల్పాహార విందునిచ్చారు. 1993 నుంచి 2000 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ ఛార్జీగా, రెండు సార్లు పార్టీ అధ్యక్షుడిగా అక్కడి సిబ్బందితో వెంకయ్యనాయుడుకు ఎంతో అనుబంధం ఉంది.

 ఈ నేపథ్యంలో ఆయన ఆ కార్యాలయంలో పని చేసే అటెండర్లు, ప్యూన్లు, డ్రైవర్లు, స్వీపర్లను తన నివాసానికి ఆహ్వానించి, వారికి అల్పాహార విందును ఇచ్చారు. ఈ సందర్భంగా తనతో వారంతా పార్టీ కోసం కష్టపడిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. పేరుపేరునా వారిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆ సందర్భంగా వారంతా సంతోషం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News