: పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: బొత్స


తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికే పీసీసీ చీఫ్ గా కట్టుబడి ఉంటానని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన బొత్స... పార్టీ నేతలతో సమావేశమై తెలంగాణ, సహకార ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ పిలుపు మేరకే ఇక్కడికి వచ్చానన్నారు. అతి సున్నితమైన
 తెలంగాణ అంశంపై శాశ్వత పరిష్కారం కోసం అధిష్ఠానం కృషి చేస్తుందని బొత్స చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన పీసీసీ, సీఎల్పీ సమావేశానికి హాజరవుతానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News