: బెడిసికొట్టిన అక్షయ్ కుమార్ 'డాడీ డే అవుట్'.. వీడియో చూడండి!


బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ డాడీ డే అవుట్ బెడిసికొట్టింది. ఈ మేరకు వీడియోను అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తన సోదరి రింకీ ఖన్నాతో కలిసి ఆస్ట్రియా విహారయాత్రకు వెళ్లింది. కుమారుడు ఆరవ్ అమెరికాలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో అక్షయ్ తన కుమార్తె నిటారాతో కలిసి ఇంట్లో ఉన్నారు. అయితే కుమార్తెను ఆడించేందుకు దగ్గర్లోని చిల్డ్రన్ పార్క్ కు అక్షయ్ తీసుకెళ్లాడు.

అక్కడ అక్షయ్ తన కుమార్తెను ఊయల ఎక్కించి ఊపాడు. అయితే పాప పడిపోతుందేమోనని అక్షయ్ ఆమె దగ్గర నిల్చున్నాడు. వేగంగా ఊయల ఊగిన నిటారా వేగంగా వచ్చి అక్షయ్ ను గుండెలమీద తన్నేసింది. అయితే నిటారా ఏమాత్రం తొట్రుపడలేదు కానీ, అక్షయ్ కుమార్ మాత్రం పడిపోబోయి నిలదొక్కున్నాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. డాడీ డే అవుట్ బెడిసికొట్టిందని దానికి క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోను మీరు కూడా చూడండి. 

  • Loading...

More Telugu News