: పూరీ చాలా మంచోడు.. కడిగిన ముత్యంలా బయటపడతాడు!: బండ్ల గణేశ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్శకుడు పూరీ జగన్నాథ్ చుట్టూ తిరుగుతూ ఉండటంపై నిర్మాత, క్యారెక్టర్ నటుడు బండ్ల గణేశ్ స్పందించాడు. పూరీ దర్శకుడిగా 'టెంపర్' వంటి బంపర్ హిట్ ను, 'ఇద్దరమ్మాయిలతో' వంటి చిత్రాలను నిర్మించిన గణేష్ మాట్లాడుతూ, పూరీ తనకు చాలా సంవత్సరాలుగా పరిచయస్తుడని, చాలా మంచోడని చెప్పుకొచ్చాడు. ఈ తరహా ఆరోపణలతో సినిమాలు చేసే ఏకాగ్రత నశిస్తుందని అభిప్రాయపడ్డ గణేశ్, పూరీ జగన్నాథ్, కడిగిన ముత్యంలా బయటపడి, ఓ మంచి హిట్ ను అందిస్తాడన్న నమ్మకం తనకుందని అన్నాడు.
కాగా, దాదాపు అందరు ప్రముఖ హీరోలతో చిత్రాలను నిర్మించిన పూరీ, డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు వచ్చిన తరువాత మనో వేదనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. తనపై ఆరోపణలు, మీడియాలో కథనాలతో బాధ పడ్డానని పూరీ వెల్లడించిన సంగతి తెలిసిందే.