: శ్రీలంకతో తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్


శ్రీలంకతో గాలేలో జరగనున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ గట్టిగా కనిపిస్తోందని, తొలుత బ్యాటింగ్ చేస్తే, అధిక పరుగులను స్కోర్ బోర్డుకు చేర్చవచ్చన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. జలుబుతో కేఎల్ రాహుల్ బాధపడుతూ ఉండటంతో, అతని స్థానంలో శిఖర్ ధావన్ ను తీసుకున్నామని అన్నాడు. పాండ్యా తొలి టెస్టును నేడు ఆడనున్నాడని చెబుతూ, అతనికి అభినందనలు చెప్పాడు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
తుది జట్ల వివరాలు:
ఇండియా:

శిఖర్ ధావన్, అభినవ్ ముకుంద్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హార్ధిక్ పాండ్యా, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్.

శ్రీలంక:

ఉపుల్ తరంగ, డిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్, దనుష్క గుణతిలక, ఆంజిలో మ్యాథ్యూస్, ఆసేలా గుణరత్నే, నిరోషన్ డిక్ వాలా, దిల్ రువాన్ పెరీరా, రంగనా హెరాత్, నువాన్ ప్రదీప్, లుహిరు కుమార.

  • Loading...

More Telugu News