: పది గంటలకు సిట్ ముందుకు ఛార్మీ... సిట్ కార్యాలయం వద్ద భద్రత పెంపు... ఇంట్లో లేని ఛార్మీ!


సిట్ ముందుకు సినీ నటి ఛార్మీ నేటి ఉదయం పది గంటలకు రానున్నట్టు తెలుస్తోంది. సినీ నటి ఛార్మీ విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. పూరీ కనెక్ట్స్ నిర్వహణ వ్యవహారాలు చూస్తున్న ఛార్మీ విచారణ కీలకమని సిట్ భావిస్తున్న నేపథ్యంలో... జర్నలిస్ట్ కాలనీలోని ఆఫీసు నుంచి ఆమె బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఆమె ఇంట్లో లేదని, సిట్ విచారణ ఎలా ఎదుర్కొవాలన్న వ్యూహంపై సన్నిహితులు, నిపుణులతో చర్చిస్తున్నట్టు మీడియా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారన్న విషయం తెలియకపోయినా, సిట్ కార్యాలయానికి ఆమె సరిగ్గా పది గంటలకు చేరుకుని, విచారణకు హాజరవనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె నివాసం వద్ద ఆమె కోసం వేచి చూస్తున్న మీడియాకు చుక్కెదురైంది. కాగా, నవదీప్ కూడా నివాసం నుంచి కాకుండా హోటల్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News