: ఢిల్లీ శివారులో తెలతెలవారుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం!
ఢిల్లీ శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ నుంచి ఘజియాబాద్, మొరాదాబాద్, షహజాన్‌పూర్, సీతాపూర్ మీదుగా లక్నోను కలిపే 24వ నంబరు జాతీయ రహదారిపై ట్రక్కు, డంపర్ ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.