: ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: మంత్రి గంటా
ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘సే నో డ్రగ్స్’ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, డ్రగ్స్ మహమ్మారిపై విశాఖ నుంచే పోరాటం ప్రారంభిస్తామని, డ్రగ్స్ పై ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, డ్రగ్స్ నియంత్రణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయనే భయం ప్రజల్లో ఉండాలని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు కాకుండా కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్..1800 425 4868, ఆంధ్రా యూనివర్శిటీలో యాంటీ డ్రగ్స్ టోల్ ఫ్రీ నెం..1800 425 0891 లను ఏర్పాటు చేశారు.