: ముద్రగడ నివాసం చుట్టూ హైడెఫినిషన్ సీసీ కెమెరాలు.. పోలీసుల కదలికలను గమనిస్తున్న నేత!


కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి తలపెట్టనున్న నిరవధిక పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముద్రగడ నివాసం కిర్లంపూడిలో ఇప్పటికే రెండు వేల మందికి పైగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ముద్రగడ తన ఏర్పాట్లు తాను చేసుకున్నారు. తన నివాసం చుట్టూ హైడెఫినిషన్ వర్చువల్ రియాలిటీ సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ పోలీసులు కనుక హింసాత్మక చర్యలకు పాల్పడితే ఆ దృశ్యాలను రికార్డు చేసే నిమిత్తం వీటిని ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. కాగా, ముద్రగడ పాదయాత్రకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News