: రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుందని ఇలా.. నదిలో ఈదుకుంటూ వెళ్తున్నాడు!


ఆఫీసుకు వెళ్లాలంటే గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో చిక్కుకుని తంటాలు ప‌డ‌లేక జ‌ల‌మార్గాన్ని ఎంచుకున్నాడు జ‌ర్మ‌నీలోని మ్యూనిచ్ ప్రాంతానికి  చెందిన బెంజిమ‌న్ డేవిడ్‌. జల‌మార్గం అంటే ఏ ప‌డ‌వ‌లోనో, ఫెర్రీలోనో కాదు... 2 కి.మీ. ఈదుకుంటూ వెళ్తున్నాడు. ప్ర‌తిరోజు త‌న ల్యాప్‌టాప్‌ను, లంచ్‌బాక్స్‌ను వాట‌ర్ ప్రూఫ్ బ్యాగులో స‌ర్దుకుని, స్విమ్ సూట్ వేసుకుని ఇసార్ న‌దిలో స‌ర‌దాగా ఈదుకుంటూ ఆఫీసుకు వెళ్తున్నాడు. న‌ది మీదుగా ఒక‌టే బ్రిడ్జి ఉండ‌టం వ‌ల్ల దాని మీద ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంటుంది. అందులో ఇరుక్కుని ఇబ్బంది ప‌డే బ‌దులు ఇలా ఈదుకుంటూ వెళ్ల‌డ‌మే బాగుంద‌ని బెంజిమన్ అంటున్నాడు. మొద‌ట్లో బ్రిడ్జి మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాళ్లు బెంజిమ‌న్‌ను చూసి న‌వ్వేవాళ్లు, త‌ర్వాత త‌న‌ ప‌నే బాగుంద‌ని వారు అర్థం చేసుకున్న‌ట్లు బెంజిమ‌న్ చెప్పాడు.

  • Loading...

More Telugu News