: నన్ను గరగపర్రు వెళ్లకుండా అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా: వీహెచ్
పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామానికి తనను వెళ్లనీయకుంటే ఆత్మహత్యకు పాల్పడతానని టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గరగపర్రులో వెలివేతకు గురైన దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడం భావ్యం కాదని అన్నారు. ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు తాను వెళ్తున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తుని ఘటనలో జరిగిన విధ్వంసంలో చంద్రబాబు హస్తం ఉందని, దీనిపై విచారణ జరపాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు తాను లేఖ రాశానని తెలిపారు. ముద్రగడతో చర్చలు జరపకుండా చంద్రబాబు పంతానికి పోతున్నారని... ఇది ఎంతమాత్రం మంచిది కాదని చెప్పారు.