: కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన దిల్ రాజు!
వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల, దిల్ రాజుల కాంబినేషన్లో వచ్చిన 'ఫిదా' సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒక క్లాస్ సినిమాను కూడా తాము ఆదరిస్తామని ఈ సినిమాను హిట్ చేయడం ద్వారా ప్రేక్షకులు నిరూపించారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సినిమాను చూసి, చాలా మంచి సినిమా తీశారని అభినందించారని తెలిపారు. కేసీఆర్ నుంచి అభినందనలు రావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని... ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పాడు.