: ట్విట్టర్‌లో సమంత కాంటెస్ట్... పోటీ పడుతున్న యువతులు!
తెలంగాణలో చేనేత వస్త్రాల ప్రాబల్యం పెంచడానికి ట్విట్టర్ వేదికగా నటి సమంత నడుం బిగించింది. తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత ట్విట్టర్‌లో `రివైవ్ హ్యాండ్లూం` పేరిట ఒక కాంటెస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా యువతులు తమ తల్లి ధరించిన చేనేత చీరను ధరించి, అదే చీరలో ఉన్న ఇద్దరి ఫొటోలను తనకు పంపించాలని కోరింది. వచ్చిన ఎంట్రీలలో టాప్ 5 ఫొటోలను స్వయంగా తానే ఎంపిక చేసి, వోవెన్ 2017 ఫ్యాషన్ షోకి ఆహ్వానిస్తానని ప్రకటించింది. ఇంకేం, యువతులు పోటీలు పడుతూ తమ ఫొటోలు పంపిస్తున్నారు. ఈ స్పందన చూసి సమంత ఉబ్బితబ్బిబ్బవుతోంది. తాను అనుకున్న దాని కంటే మంచి స్పందన వస్తోందని సమంత ఆనందం వ్యక్తం చేస్తోంది. వచ్చిన ఎంట్రీలన్నిటినీ సమంత ట్విట్టర్ పేజీలో చూడొచ్చు.