: రేపే చార్మి విచారణ... ఆగస్టు 2 వరకు మరెవరికీ నోటీసులు లేనట్టే!


సినీ నటి చార్మిని ఎక్సైజ్ అధికారులు రేపు విచారించనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, మహిళా అధికారులతోనే, తన న్యాయవాది సమక్షంలో విచారించేందుకు ఆదేశించాలని కోరుతూ చార్మి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అది  ఈ రోజు విచారణకు రానుంది. విచారణకు ఆమె సుముఖంగానే ఉండడంతో రేపు విచారణ జరగడం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది.

వాస్తవానికి ఈ నెల 22నే ఆమెను విచారించాల్సి ఉండగా, విచారణ తీరుపై అభ్యంతరాల నేపథ్యంలో రేపటికి వాయిదా పడింది. విచారణలో భాగంగా ఒత్తిడి చేయరాదని, తన నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకోరాదని ఆమె పిటిషన్ లో కోరారు. ఇక డ్రగ్స్ కేసులో సినీ నటులు మరి కొంత మందికి ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ శాఖ స్పష్టం చేసింది. ఈ కేసులో ఆగస్ట్ 2 వరకు ఎవరికీ నోటీసులు జారీ చేయడం లేదని పేర్కొంది. 

  • Loading...

More Telugu News