: నాకు ఎవరితోనూ ఏం భయం లేదు.. డేంజర్ లేదు: అకున్ సబర్వాల్


తన భద్రతకు ఎలాంటి సమస్యా లేదని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘చాలా మందికి నా సెక్యూరిటీ గురించి చాలా టెన్షన్ గా ఉంది. నా ఇద్దరు బాడీగార్డ్స్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (పీఎస్ ఓ) చాలా మంచివాళ్లు. ఐయామ్ టోటల్లీ సేఫ్. ఎవరితోనూ ఏం భయం లేదు.. డేంజర్ లేదు’ అని అకున్ సబర్వాల్ నవ్వుతూ అన్నారు. అనంతరం, ‘డ్రగ్స్..మాదక పదార్థాలు వద్దు’, ‘సే నో టు డ్రగ్స్’ అనే తెలుగు, ఇంగ్లీషు పోస్టర్లను చంద్రవదన్, అకున్ సబర్వాల్ కలసి ఆవిష్కరించారు. ఈ పోస్టర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రాలు ఉన్నాయి. 

  • Loading...

More Telugu News