: అందరికీ 'వైట్' సెంటిమెంట్... పూజలు చేసి విచారణకు వచ్చిన సినీ ప్రముఖులు
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సిట్ విచారణకు వస్తున్న సినీ ప్రముఖులు 'వైట్' సెంటిమెంటును నమ్ముకున్నారు. విచారణకు వచ్చిన పూరీ జగన్నాథ్ నుంచి, నవదీప్ వరకూ అందరూ తెల్ల చొక్కాలు ధరించే రావడం గమనార్హం. తొలి రోజున పూరీ తెల్ల చొక్కాతో రాగా, సుబ్బరాజు, తరుణ్ తదితరులంతా అదే సెంటిమెంట్ ను కొనసాగించారు. ఇక విచారణకు వచ్చే ముందు వీరంతా ప్రత్యేక పూజలు చేసి, పురోహితుల సలహాలు తీసుకుని మరీ విచారణకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పబ్ లలో జీషన్ అలీ నుంచి సేకరించిన అత్యంత నాణ్యతగల కొకైన్ ను సరఫరా చేసినట్టు నవదీప్ పై ఆరోపణలు ఉండగా, పబ్ లలో జరిగే అన్ని చీకటి కోణాలు, సీక్రెట్ గదుల ఏర్పాటుపై సిట్ మరిన్ని విషయాలను నవదీప్ నుంచి లాగుతున్నట్టు తెలుస్తోంది.