: ప్రియమైన నేతకు శుభాకాంక్షలు: కేటీఆర్ కు సమంత ట్వీట్
తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ నటి సమంత జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. 'ప్రియమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తికి ఆయన ఓ నిదర్శనం. ఆయన మనకు ఓ మార్గదర్శి. మీకు నేను తెలియడం నాకు దక్కిన గౌరవం' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపింది. చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం కేటీఆర్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చేనేతకు బ్రాండ్ అంబాసడర్ గా సమంత వ్యవహరిస్తోంది.