: ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డ హర్మన్ ప్రీత్ కు డీఎస్పీ ఉద్యోగం!


మహిళల ప్రపంచ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి... తృటిలో కప్ ను కోల్పోయిన టీమిండియా జట్టుపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. తుది వరకు భారత మహిళా క్రికెటర్లు పోరాడినప్పటికీ, కీలక సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనై, 9 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ ప్రయాణంలో, సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సుడిగాలి ఇన్నింగ్స్ తో కేవలం 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది బ్యాట్స్ ఉమన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఈ నేపథ్యంలో, ఆమెను పంజాబ్ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించింది. ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News