: డ్రగ్స్ దందాలో నవదీప్ విచారణ నేడే... ప్రశ్నావళి సిద్ధం!


హైదరాబాదులోని ఉన్నత వర్గాలతో పాటు, టాలీవుడ్ లో పెనుకలకలం రేపుతున్న డ్రగ్స్ దందాలో నేడు సిట్ ముందు యువ నటుడు నవదీప్ విచారణకు హాజరుకానున్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ లను ఒక్కొక్కరిని సుమారు 10 నుంచి 13 గంటల పాటు విచారించిన సిట్... నవదీప్ కోసం ప్రత్యేకమైన ప్రశ్నావళిని సిద్ధం చేసింది.

ఇప్పటికే తరుణ్ నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్, గతంలో పలు సందర్భాలలో డ్రగ్స్ కేసుల్లో నవదీప్ పేరు తెరపైకి వచ్చి ఉండడంతో, దానిని దృష్టిలో పెట్టుకుని, ప్రశ్నావళి రూపకల్పనలో మరింత ప్రత్యేకంగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు నవదీప్ ను కూడా సుదీర్ఘంగా విచారించేందుకు సమాయత్తమవుతున్నారు. 

  • Loading...

More Telugu News