: ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో... కిర్లంపూడిలో టెన్షన్.. టెన్షన్!


కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26 నుంచి తన పాదయాత్ర ప్రారంభిస్తానని గట్టిగా చెబుతున్న విషయం తెలిసిందే. మరోపక్క, ఈ పాదయాత్రకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, పాదయాత్ర చేసి తీరుతానని చెబుతున్న ముద్రగడ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు.

జిల్లా వ్యాప్తంగా 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా, కేవలం, కిర్లంపూడిలోనే 2 వేల మంది పోలీసుల నిఘా పెట్టడం గమనార్హం. ముద్రగడను కాపు ఉద్యమనేతలు కలవకుండా పోలీసులు అడ్డుకుంటుండటంతో కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News