: పాక్ పై మండిపడ్డ వెంకయ్యనాయుడు!


పాకిస్థాన్ తన ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని మార్చుకుందని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ‘కార్గిల్ పరాక్రమ పరేడ్’ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్థాన్, 1971లో జరిగిన యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా పాక్ కు ఒనగూరేదేమీ ఉండదని అన్నారు. భారత్ లో కాశ్మీర్ భాగమని, వదలుకునే ప్రసక్తే లేదని వెంకయ్యనాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News