: టొమాటోలకు పోలీసుల కాపలా... దొంగలెత్తుకుపోతున్నారు మరి!


ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా 20 మంది వచ్చి, సుమారు 300 కిలోల టొమాటోలను దొంగిలించుకుపోవడంతో అవాక్కైన వ్యాపారులు టొమాటోలకు పోలీసులను కాపలాగా ఉంచాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఘటన జరిగింది. మార్కెట్ కు వచ్చిన టొమాటో కార్టన్ లకు కాపలా ఏర్పాటు చేసినట్టు వ్యాపారులు తెలిపారు. దొంగిలించుకుపోయిన టొమాటోల ధర రూ. 70 వేల వరకూ ఉంటుందని, 30 కార్టన్ లను వీరు తీసుకుపోయారని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా టొమాటోలకు కొరత ఏర్పడి కిలో ధర రూ. 100ను దాటిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News