: విచారణ ముగిసిన తరువాత తరుణ్ మీడియా సమావేశంలో ఏం చెప్పాడంటే...!


సుమారు పదమూడున్నర గంటల పాటు సిట్ విచారణను ఎదుర్కొన్న హీరో తరుణ్, రాత్రి 12 గంటల సమయంలో మీడియాతో మాట్లాడాడు. మాదకద్రవ్యాల మహమ్మారిని సమూలంగా నాశనం చేయాల్సి వుందని తెలిపాడు. "సిట్ అధికారులు చాలా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్లు అడిగినదానికంతా నేను ప్రాపర్ గా ఆన్సర్స్ ఇచ్చాను. వాళ్లు హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో... ఇదొక బిగ్ ప్రాబ్లమండీ. టాలీవుడ్ లోనే కాదు. ప్రతి ఫీల్డ్ లోనూ ఉంది. దీన్ని కర్బ్ చేయాల్సిన, ఇరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికీ ఉంది. అండ్... నా పూర్తి సహకారం సిట్ కు అందించాను. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ... థ్యాంక్యూ" అని ముక్తసరిగా మూడు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయాడు. ఉదయం నుంచి ఉపవాసం కారణంగా ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమయంలో తరుణ్ కాస్త అలసిపోయినట్టు కనిపించాడు.

  • Loading...

More Telugu News