: ‘బీటెక్ విద్యార్థిని దారుణహత్య’ కేసును ఛేదించిన పోలీసులు.. ఆమె ఇంట్లో అద్దెకు ఉన్న యువకుడే నిందితుడు!


కడప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న సాయంత్రం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మయంలో బీటెక్‌ విద్యార్థి హైందవిని ఒక దుండ‌గుడు దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్‌ అనే యువకుడే ఆమెను హ‌త్య చేశాడ‌ని చెప్పారు. మృతురాలు హైందవి మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ఈ కేసును ఛేదించామ‌ని తెలిపారు. హైందవి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని నవీన్ గుర్తించి, నిన్న ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారయత్నం చేశాడ‌ని అన్నారు.

హైంద‌వి తీవ్రంగా ప్రతిఘటించడంతో న‌వీన్ ఆమెపై దాడి చేశాడ‌ని అన్నారు. ఈ విష‌యాన్ని ఎవరిక‌యినా చెబుతుంద‌నే భ‌యంతో ఆమెను దారుణంగా హత్య‌చేశాడ‌ని, కేసును త‌ప్పుదారి ప‌ట్టించ‌డానికి ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభ‌ర‌ణాలు, ఆమె ఇంటి బ‌య‌ట ఉన్న‌ స్కూటీతో పారిపోయాడ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News