: బిగ్‌బాస్ షోలో ఏడుస్తున్న గాయని మధుప్రియ!.. బయటకు పంపేయమంటున్న ప్రేక్షకులు!
ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌షోలో గాయని మధుప్రియ పాల్గొంటోన్న విషయం తెలిసిందే. అయితే, ఆమె ఈ షోలో ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తోందట. బిగ్‌బాస్ హౌస్‌లో మిగతా సెలబ్రిటీలు అందరూ పనులు చేసుకుంటోంటే ఆమె మాత్రం చేయడం లేదట. ఈ విషయాన్ని ఆ షో చూస్తోన్న ప్రేక్షకులే తెలిపారు. తాజాగా స్టార్ మా తన ట్విట్టర్ ఖాతాలో బిగ్‌బాస్‌కు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మధుప్రియ ఏడుస్తూ కనిపించింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతగా ఏడ్చే మధుప్రియ ఈ షోకు ఎందుకు రావాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు. మధు ప్రియను షో నుంచి బయటకు పంపేయడం మంచిదని కామెంట్లు చేస్తున్నారు.
ఈవిడ గారికి దండేసి దండం పెట్టాలని మరికొందరు విమర్శిస్తున్నారు. బిగ్‌బాస్‌లాంటి షో తొలిసారిగా తెలుగు బుల్లితెరలో ప్రసారం అవుతుండడంతో ప్రేక్షకులు ఈ షోపై కాస్త అధికంగానే దృష్టి పెట్టారు. ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు.