: చక్ దే ఇండియా.. రేపటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో సెహ్వాగ్ వీడియో సందేశం
రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి లండన్ వేదికగా ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అద్భుత విజయాలు నమోదు చేసుకుంటూ ఫైనల్‌కు చేరిన భారత్ రేపు ఇంగ్లండ్‌తో కప్పు కోసం పోరాడనుంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్ ఎంతో పటిష్ఠంగా కనపడుతోంది. భారత మహిళా క్రికెటర్లు కూడా అద్భుతంగా రాణిస్తుండడంతో రేపు జరిగే మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో భారత మహిళల జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ రోజు ఓ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. భారత క్రీడాకారిణులు మనల్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేస్తున్నారని, రేపు జరిగే మ్యాచులో వారు రాణించాలని కోరుతున్నానని అన్నాడు. చివరికి చక్ దే ఇండియా అని పేర్కొన్నాడు.