: మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, ఫైనల్స్ కు దూసుకెళ్లిన నేపథ్యంలో ఈ నజరానాను అనౌన్స్ చేసింది. జట్టులో ఉన్న ఒక్కో ప్లేయర్ కు రూ. 50 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించింది. సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున ఇవ్వనుంది. రేపు జరగనున్న ఫైనల్స్ లో మహిళల జట్టు విజేతగా నిలిస్తే... ఈ నజరానా మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, బీసీసీఐ ప్రకటించిన ప్రోత్సాహకంతో రేపటి మ్యాచ్ లో మన అమ్మాయిలు మరింత ఉత్సాహంగా ఆడే అవకాశం ఉంది.