: ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా... 9 మంది మృతి
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు డ్రైవర్ తప్పించబోయే క్రమంలో ఆ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రయాణికులంతా గుజరాత్ కు చెందిన వారని, వారంతా దైవ క్షేత్రాల దర్శనకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ బస్సు అహ్మదాబాద్ నుంచి నిన్న రాత్రి బయలుదేరిందని చెప్పారు.