: రిలీజ్ కు ముందే లీకైన అక్షయ్ కుమార్ మూవీ.. టెన్షన్ లో దర్శకనిర్మాతలు!


బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ' స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే లీక్ కావడంతో సినిమా యూనిట్ సభ్యులు షాక్ కు గురయ్యారు. సినిమాకు సంబంధించిన సెకండ్ హాఫ్ మొత్తం లీక్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు రెమో డిసౌజా ధ్రువీకరించాడు. అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్ లు నటించిన ఈ సినిమాలో... ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి అవసరమనే సందేశాన్ని ఓ ప్రేమ కథ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా పట్ల ప్రధాని మోదీ కూడా అభినందనలు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ విడుదలకు ముందే సినిమా లీక్ కావడం దర్శకనిర్మాతలకు టెన్షన్ పుట్టిస్తోంది. 

  • Loading...

More Telugu News