: మలేసియా టౌన్ షిప్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినుల గంజాయి గుప్పుగుప్పు


హైదరాబాదులోని మలేసియా టౌన్ షిప్ లో గంజాయి కొడుతూ సాఫ్ట్ వేర్ ఉద్యోగినులు పట్టుబడ్డారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించుకున్న ఇద్దరు యువతులు మలేసియా టౌన్ షిప్ లో ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఆ ఫ్లాట్ లో మరో ముగ్గురు యువకులతో కలిసి గంజాయి తాగుతుంటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ వివాదం హైదరాబాదును అతలాకుతలం చేస్తున్న వేళ... పబ్బులకు వెళ్లేందుకు సంశయిస్తున్న పార్టీ ఫ్రీక్స్... మత్తుపదార్థాలను ఈ విధంగా సేవిస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News