: నాకు పబ్ లేదు.. ఆరేళ్ల ముందే దాన్ని వదిలేశా: హీరో తరుణ్


తనకు హైదరాబాదులో పబ్ ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీ హీరో తరుణ్ అన్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణకు తన తండ్రితో కలసి ఈ రోజు సిట్ కార్యాలయానికి తరుణ్ వచ్చాడు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ, ఏడేళ్ల క్రితం ఓ పబ్ లో తాను పార్ట్ నర్ గా ఉండేవాడినని చెప్పాడు. ఆ పబ్ లో పార్ట్ నర్ షిప్ వదులుకుని ఆరేళ్లు దాటుతోందని... ప్రస్తుతం ఆ పబ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తన నిజాయతీ ఏంటో సిట్ ముందు నిరూపించుకుంటానని చెప్పాడు. సిట్ విచారణ అనంతరం అన్ని విషయాలను చెబుతానని... అంతవరకు సంయమనం పాటించాలని విన్నవించాడు. మరోవైపు తరుణ్ నిర్వహిస్తున్న పబ్ నుంచే ఇతర పబ్ లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. 

  • Loading...

More Telugu News