: నేటి ఉదయం 10: 30 నిమిషాలకు సిట్ కార్యాలయంలో తరుణ్ విచారణ షురూ!
హైదరాబాదుతో పాటు టాలీవుడ్ ను పట్టికుదిపేస్తున్న డ్రగ్స్ దందాలో నేడు సినీ నటుడు తరుణ్ విచారణ ఎదుర్కోనున్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు వంటి వారి విచారణతో తలబొప్పి కట్టిన టాలీవుడ్ కు తరుణ్ ను సిట్ విచారించడం మరింత ఇబ్బంది పెడుతోంది. బాల నటుడిగా స్టార్ డమ్ సంపాదించుకున్న తరుణ్... విజయాలతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత వరుస ఫెయిల్యూర్స్, ఆర్తీ అగర్వాల్ తో ప్రేమ వ్యవహారం వంటి విషయాలతో వార్తల్లో నిలిచాడు. తరువాత సినీ పరిశ్రమలో అవకాశాలు లేక హైదరాబాదులో ఆన్ పబ్ ను నిర్వహించడం మొదలు పెట్టాడు.
కేవలం పబ్ నిర్వహణతోనే తరుణ్ లావిష్ లైఫ్ లీడ్ చేయడం ఆరంభించాడు. దీనిపై సిట్ అధికారులు నేడు తరుణ్ ను విచారించనున్నారు. నేటి ఉదయం 10:30 నిమిషాలకు సిట్ కార్యాలయానికి తరుణ్ చేరుకోనున్నాడు. అనంతరం అతనిని సిట్ టీమ్ విచారించనుంది. 11 గంటలకు పబ్ ల యజమానులతో అకున్ సబర్వాల్ భేటీ అవుతారు. ఆ భేటీలో తరుణ్ కూడా పాల్గొంటాడు. ఆ భేటీ ముగిసిన తరువాత అసలు విచారణ ఆరంభమవుతుందని తెలుస్తోంది. మరి పబ్ యజమాని అయిన తరుణ్ ఎలాంటి వివరాలు వెల్లడిస్తాడో తెలియాల్సి ఉంది. తరుణ్ నోరిప్పితే మాత్రం సినీ పరిశ్రమలో మరిన్ని ప్రకంపనలు ప్రారంభమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.