: 23న టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి !
ఎన్ సీటీఈ ప్రమాణాలకు మించి సిలబస్ రూపొందించిన కారణంగా టెట్ నిర్వహణ నిలిపివేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన సంగతి విదితమే. దీనిపై ధర్మాసనం స్టే విధించింది. టెట్ పరీక్ష నిలిపివేసేలా స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం పూర్తి వాదనల కోసం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా టెట్ కన్వీనర్ మాట్లాడుతూ, ఈ నెల 23న టెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. టెట్ నిర్వహణ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1574 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3,67,912 మంది అభ్యర్థులు టెట్ కు హాజరుకానున్నట్టు చెప్పారు.