: పీవోకే నుంచి తరలించిన... 25 కిలోల డ్రగ్స్ పట్టివేత
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ ప్రాంతంలో అధికారులకు ఏకంగా 25 కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఆ డ్రగ్స్‌ను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు వ్యక్తులు ఓ ట్రక్కులో తరలిస్తుండగా పట్టుకున్నామని సంబంధిత అధికారులు చెప్పారు. ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అవి ఏ రకమైన మాదకద్రవ్యాలనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో పలువురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఇంతకు ముందు కూడా డ్రగ్స్ ను తరలించారా? అనే విషయంపై కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.