: సెమీస్ లో దుమ్మురేపిన హ‌ర్మ‌న్‌ కు ఆసిస్ క్రికెటర్ గిఫ్ట్!


మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో ఆసీస్‌తో జ‌రిగిన‌ సెమీ ఫైన‌ల్లో ప‌రుగుల వ‌ర్షం కురిపించిన భార‌త క్రీడాకారిణి హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు ఆసీస్ జ‌ట్టు క్రీడాకారిణి త‌న జెర్సీని కానుక‌గా అంద‌జేసింది. హ‌ర్మ‌న్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన అలెక్స్ బ్లాక్‌వెల్ మ్యా చ్ అనంత‌రం ఆమె జెర్సీని హ‌ర్మ‌న్‌కు ఇచ్చింది. వీరిద్ద‌రూ మంచి స్నేహితులు కూడా. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండ‌ర్స్ జ‌ట్టుకు బ్లాక్ వెల్ కెప్టెన్‌. అదే జ‌ట్టులో హ‌ర్మ‌న్ కూడా ఆడుతోంది. అలా వీరి మ‌ధ్య స్నేహం కుదిరింది.

సెమీ ఫైన‌ల్లో బ్లాక్‌వెల్ కూడా బాగానే ఆడింది. ఆమె ఆట‌ను చూసి ఒకానొక స‌మ‌యంలో భార‌త్ ఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాలు లేన‌ట్లే అనే అనుమానం మొద‌లైంది. 90 ప‌రుగులు చేసి బ్లాక్‌వెల్ ఔట‌య్యాక గానీ భార‌త అభిమానుల మ‌న‌సు కుదుట‌ప‌డ‌లేదు. మ్యాచ్ ఫ‌లితం ఎలా ఉన్నా స్నేహితురాలి ఆటను మెచ్చుకుంటూ బ‌హుమ‌తి ఇవ్వ‌డం గొప్ప ప‌నే మ‌రి!

  • Loading...

More Telugu News