: నటుడు సుబ్బరాజుకు సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు ఇవే
డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10.15 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుబ్బరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కింద పేర్కొన్న ప్రశ్నలను అధికారులు అడిగినట్టు తెలుస్తోంది.
- మీకు డ్రగ్స్ అలవాటు ఉందా?
- పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటారా?
- పూరీ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా?
- పూరీతో కలసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు?
- అక్కడ ఏం చేశారు?
- అక్కడ పూరీ విదేశీ నంబర్లు వాడారు... మీకు తెలుసా?
- కెల్విన్ తెలుసా?
- ఎలా పరిచయం అయ్యాడు?
- పూరీ, శ్యామ్ లతో పాటు మీరూ కెల్విన్ ను కలిసేవారా?
- పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది?
- మీరు డ్రగ్స్ పార్టీలకు వెళ్లేవారా?
- కెల్విన్ తో మీరు డైరెక్ట్ గా డీల్ చేసేవారా?
- కెల్విన్ కు మీరు ఎవరెవరిని పరిచయం చేశారు?
- మీకు ఎంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లు తెలుసు?
- సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది?
- మీ రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలను పరీక్షలకు తీసుకోవచ్చా?